Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 63 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”
హసన్ హదీథు. అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“భక్తి పరునిపై ధర్మపండితుని శ్రేష్ఠత, ఘనత యొక్క ఉపమానం ఎటువంటిది అంటే, మీలోని సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్ఠత మరియు ఘనత వంటిది”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు, ఆకాశాలు మరియు భూమిలో ఉన్న వారందరూ, చివరికి తన పుట్టలో ఉన్న చీమ మరియు నీటిలో ఉన్న చేప కూడా ప్రజలకు మంచిని బోధించే వానిపై ఆశీర్వాదాలు పలుకుతారు.”
హసన్ హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
"మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్‌ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨
హసన్ హదీథు అని అత్తిర్మిదీ తెలిపినారు. అత్తిర్మిదీ నమోదు చేసినారు:
"ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".
హసన్ హదీథు. అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"నిశ్చయంగా సమాధి పరలోక ప్రయాణంలోని మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశలు చాలా కఠినంగా ఉంటాయి."
హసన్ హదీథు. అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:
“మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.
హసన్ హదీథు. అబూదావూద్ నమోదు చేసినారు: