Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 79 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."
హసన్ హదీథు. అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:
హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
హసన్ హదీథు. ఇబ్న్ మాజహ్ మరియు అద్దారఖుత్నీ మొదలైనవారు ముస్నదుగా నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది.
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
"ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు"
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ చేతిలో పట్టు వస్త్రాన్ని, తన కుడి చేతిలో బంగారాన్ని పట్టుకుని, తన రెండు చేతులను పైకి ఎత్తి ఇలా అన్నారు: “నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
“ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”
హసన్ హదీథు. అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: