Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 14 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు” అని వేడుకుంటాను. దానికి “నీకు తెలుసా, నీ తరువాత వీరు ఏమేం చేసినారో?” అని సమాధానం ఇవ్వబడుతుంది. అల్లాహ్ సాక్షిగా వాళ్ళు వేగంగా తమ మడమలపై వెనుదిరిగి పోతారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరియు అవిశ్వాసి విషయంలో, అతడు అల్లాహ్ కొరకు మాత్రమే చేసిన మంచి పనులకు, అల్లాహ్ అతనికి ఈ ప్రాపంచిక జీవితములోనే ప్రసాదిస్తాడు. అతడు పరలోకము చేరుకున్నపుడు అతనికి ప్రతిఫలం ప్రసాదించడానికి ఒక్క సత్కార్యమూ ఉండదు".
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"స్వర్గంలో ప్రవేశించే మొదటి సమూహం పూర్ణ చంద్రుని (పౌర్ణమి చంద్రుడు) వలె ప్రకాశవంతంగా ఉంటారు. వారిని అనుసరించే తదుపరి సమూహం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా మెరుస్తారు. అక్కడ వారికి మూత్ర విసర్జన, విరేచన, ఉమ్మడం, ముక్కు తుడిచుకోవడం వంటి అవసరాలు ఏవీ ఉండవు. వారి జుట్టు దువ్వుకునే దువ్వెనలు బంగారంతో తయారవుతాయి. వారి చెమట ముస్క్ పరిమళంలా సువాసనను గుబాళిస్తూ ఉంటుంది. వారు ఉపయోగించే ధూపపు కట్టెలు అతి విలువైన అలూవా (ఒక రకం పరిమళ వృక్షం)కు చెందినవి. వారికి హూర్-అల్-ఐన్ (స్వర్గపు అపురూప స్త్రీలు) భార్యలు అవుతారు. వారందరూ ఒకే ఆకారంలో, ఒకే రూపంలో తమ తండ్రి ఆదాం అలైహిస్సలాం రూపాన్ని పోలి, దాదాపు అరవై ముళ్ల (60 ముళ్ల) ఎత్తులో ఉంటారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"నేను ప్రళయ దినాన ప్రజలకు నాయకుడని. ఈ విషయం ఎందుకో మీకు తెలుసా? అల్లాహ్ మొదటి తరం నుండి చివరి తరం వరకు ఉనికిలో వచ్చిన ప్రజలందరినీ ఒకే చోట సమీకరిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు అతి సమీపంలోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎంతో బాధతో(ఆ వేడిని) తట్టుకోలేని స్థితిలో భయకంపితులై ఉంటారు. అపుడు ప్రజలు ఇలా అంటారు: 'మీరు చూడటం లేదా? ఎంత భయంకరమైన స్థితి వచ్చింది! మన కోసం మన ప్రభువు వద్ద ఎవరైనా శిఫారసు చేసేవారు ఉన్నారా?' అప్పుడు వారు ఒకరినొకరు సలహా అడుగుతారు, ఎవరో 'ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' అంటారు. వారు ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లి, ఇలా అంటారు: 'మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు, దేవదూతలు మీకు సాష్టాంగ ప్రణామం చేశారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' దానికి ఆదం అలైహిస్సలాం ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక చెట్టు నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. అయ్యో నా ప్రాణం! అయ్యో నా ప్రాణం! మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' ... (ఇలాగే నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిముస్సలాం వద్దకు వెళ్లి అందరూ తమ తప్పులను స్మరించుకుని తమను తాము రక్షించుకోవాలని అంటారు)...చివరికి వారు నా వద్దకు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి, ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి, తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' నేను అల్లాహ్ సింహాసనం క్రింద సజ్దా చేస్తాను. అప్పుడు అల్లాహ్ తన మహిమలు, స్తుతులను నాకు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - ఆమోదించబడుతుంది!' అపుడు నేను ఇలా అంటాను: 'ఓ నా ప్రభువా! నా సమాజం. ఓ నా ప్రభువా! నా సమాజం,' దానికి అల్లాహ్ ఇలా అంటాడు: 'నీ సమాజంలోని వారిలో తమపై ఏ లెక్కా లేని వారిని స్వర్గం కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు!' ఆ స్వర్గం ద్వారాల మధ్య దూరం మక్కా-హిమ్యర్ (లేదా మక్కా-బుస్రా) మధ్య దూరం అంత ఉంటుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“వినండి! మీకు స్వర్గవాసుల గురించి తెలియజేయనా? ప్రజలు తక్కువగా చూసే ప్రతి బలహీనమైన, పేద మరియు అంతగా ఎవరికీ తెలియని వ్యక్తి; అతడు గనుక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అన్నట్లయితే, అల్లాహ్ దానిని నెరవేరుస్తాడు. వినండి! మీకు నరకవాసుల గురించి తెలియజేయనా? మదమెక్కిన ప్రతి క్రూరుడు, మూర్ఖుడు, పిసినారి మరియు గర్విష్టి నరకంలో ప్రవేశిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు