Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 37 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి) ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినాన ప్రజలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, మరియు సున్తీ చేయని స్థితిలో (హషర్ మైదానంలో) జమ చేయ బడతారు.” నేను అడిగాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! సమీకరించబడిన స్త్రీలు మరియు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: “ఓ ఆయిషా! ఆ సమయంలో పరిస్థితి ఒకరినొకరు చూసుకోవడం కంటే చాలా తీవ్రంగా, గంభీరంగా ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?” అక్కడ ఉన్న వారు ఇలా అన్నారు: “మాలో పేదవాడు అంటే ధనము లేనివాడు మరియు ఆస్తిపాస్తులు లేనివాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “నిశ్చయంగా నా ఉమ్మత్ (ముస్లిం సమాజము) యొక్క అసలైన పేదవాడు ఎవరంటే – అతడు పునరుథ్థాన దినమున నమాజులతో, ఉపవాసాలతో, దానధర్మాలు, జకాతు దాతృత్వాలతో వస్తాడు; అయితే వీటన్నింటితో పాటు అతడు ఒకరిని అన్యాయంగా అవమానించి ఉంటాడు; మరొకరిని అకారణంగా దూషించి ఉంటాడు; ఇంకొకరి సంపదను అన్యాయంగా తినేసి ఉంటాడు; ఒకరి రక్తాన్ని అధర్మంగా చిందించి ఉంటాడు; మరొకరిని అకారణంగా కొట్టి ఉంటాడు. అతడు వీటన్నింటితో పాటు కూడా వస్తాడు. అణచివేతకు గురిచేయబడిన ప్రతి ఒక్కరికి ఇతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. అంతేగాక ఒకవేళ న్యాయం పూర్తిగాక ముందే ఇతని మంచి పనులు అయిపోతే, అణచివేతకు గురి అయిన వారి పాపాలలో కొన్ని ఇతనిపై వేయబడతాయి మరియు అతడు నరకాగ్నిలో పడవేయబడతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది; దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల వంటివి; దాని నుండి నీటిని త్రాగిన వారెవరూ మరింకెన్నడూ దాహానికి లోను కారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు