Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 67 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, మరియు అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన ప్రదేశాలు మార్కెట్లు (బజార్లు, సంతలు, అంగళ్ళు, వాణిజ్యకేంద్రాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశలు మొ.)”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
«అగోచర విషయాల తాళపు చెవులు ఐదు, {నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానము కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం ఎరిగినవాడు.}».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు ఆయన “నేను మీకు దానికంటే కూడా ఉత్తమమైన దానిని ప్రసాదిస్తాను” అంటాడు. వారు “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది?” అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు: “నేను మీకు నా ప్రమోదాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాను మరియు ఆ తర్వాత నేను మీ పట్ల ఎన్నటికీ అసంతృప్తి చెందను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు.»
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు:
"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు." ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: