Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 123 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (54)
“మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఒక వ్యక్తి కాలిబాట మీద నడుస్తుండగా, దారిలో అతనికి ఒక ముళ్ళ కొమ్మ కనిపించింది, అతడు దానిని తీసి ప్రక్కన పడవేసాడు. అల్లాహ్ అతణ్ణి కృతజ్ఞతతో ప్రశంసించి అతణ్ణి క్షమించాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ అబుల్ ముందిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునకు బాగా తెలియును” అన్నాను. అందుకు ఆయన తిరిగి “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది; , మరియు స్వర్గములో, మీలో ఎవరి వద్దనైనా ఉన్న చిన్న కొరడాతో ఆక్రమించ దగినంత చిన్న స్థలమైనా ఈ ప్రపంచం కంటే మరియు దాని ఉపరితలంపై ఉన్న దాని ప్రతిదాని కన్నా ఉత్తమమైనది; మరియు అల్లాహ్ యొక్క దాసుడు, ఒక ఉదయం లేదా ఒక సాయంత్రం అల్లాహ్ మార్గములో చేసే ప్రయాణం ఈ ప్రపంచం మరియు దాని ఉపరితలంపై ఉన్న ప్రతి దాని కంటే ఉత్తమమైనది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: