Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 82 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ ఉన్న స్థితిలో ఉంటే తప్ప. లేకపోతే వారికి చుట్టుకున్న ఆపదే మీకూ చుట్టుకొనవచ్చును.” అలా పలికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం త్వరత్వరగా ఆ ప్రాంతాన్ని వెనుక వదిలి సాగిపోయినారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక ఎడారి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను ఆరాధించు; (అందులో) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకు; నిర్దేశించబడిన ఐదు నమాజులను ఆచరించు; విధి చేయబడిన జకాతును చెల్లించు; మరియు రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు”. అది విని ఆ ఎడారి వాసి ఇలా అన్నాడు: “నా ప్రాణాలు ఎవరి చేతిలోనైతే ఉన్నాయో, ఆయన సాక్షిగా; మీరు చెప్పిన విషయాలకు ఒక్కటి కూడా అధికం చేయను (కలుపను)”. అలా అని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు అతడి వైపు చూడండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. నిశ్చయంగా, నేను కేవలం చేరవేసే వాడిని మాత్రమే. ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. (గుర్తుంచుకోండి) ఈ ఉమ్మత్ (కల్మషము లేని విశ్వాసము గలవారు) అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వేర్వేరు మార్గాలను (ధర్మాలను) అనుసరించేవారు వీరికి ఎటువంటి హాని కలుగజేయలేరు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పనులను ఆదేశించినప్పుడు, వారు చేయగలిగిన వాటినే ఆదేశించేవారు. వారు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! మేము మీలాంటి వాళ్ళం కాదు. నిశ్చయంగా అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను క్షమించాడు". అప్పుడు ఆయన ఎంతగా కోపగించుకున్నారంటే, ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆయన ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: