Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 6 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఆమె పాలుత్రాగే తన శిశువుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు రాగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అయితే ఆ శిశువు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు, వెంటనే ఆయన నీటిని తెప్పించి దానిపై చిలకరించారు, దానిని (వస్త్రాన్ని) కడగలేదు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి”. సహీహ్ బుఖారీలో ఇలా ఉంది “అతడు వుదూకు ముందు తన పురుషాంగాన్ని కడుక్కుని వుదూ చేయాలి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఒకసారి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు మదీనా వీధులలోని ఒక వీధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడం జరిగింది. అపుడు అబూ హురైరహ్ ‘జనాబహ్’ స్థితిలో (అపరిశుద్ద స్థితి: తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుద్ధ పరుచుకోవలసిన స్థితిలో) ఉన్నారు. ఆయన (అక్కడి నుండి మెల్లగా) జారుకుని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను లేకపోవడాన్ని గమనించి, తిరిగి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ అబూ హురైరహ్?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అపరిశుద్ద స్థితిలో ఉండగా మీతో కలిసినాను. నేను గుస్ల్ చేసి (తలస్నానం చేసి) పరిశుద్ధుడిని కానంత వరకు, ఆ స్థితిలో మీ ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేకపోయింది”; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొను ప్రదేశములోనికి ప్రవేశించినప్పుడు, నేను మరియు ఒక సేవకుడు ఒక నీటితో నిండిన తోలుతిత్తిని, ఒక చేతికర్రను తీసుకుని వెళ్ళే వాళ్ళము, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో తనను తాను శుభ్రపరుచుకునేవారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు