Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 19 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ ముగించిన తరువాత, సూర్యుడు బాగా ఉదయించే వరకు ఆయన నమాజు చేసిన చోటనే కూర్చునేవారు, ఆయన ఫజ్ర్ (ఉదయం) నమాజు చేసిన చోట నుండి సూర్యుడు ఉదయించే వరకు లేచేవారు కాదు. సూర్యుడు ఉదయించిన తర్వాతనే లేచేవారు. సహాబాలు (జాహిలియ్యా) అజ్నా కాలం నాటి విషయాలను మాట్లాడుకుంటూ, నవ్వుకునేవారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చిరునవ్వు నవ్వేవారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
«ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను ఒక మానవుడ్ని మాత్రమే. కావున ముస్లింలలో ఏ వ్యక్తినైనా నేను దూషించినా, శపించినా లేదా కొరడాతో కొట్టినా, నీవు దానిని అతని కొరకు శుద్ధీకరణగా మరియు కారుణ్యంగా చేయుము».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసిన ఒక పెద్ద హదీథులోని భాగము:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దళాన్ని పంపినారు, అన్సార్లలోని ఒక వ్యక్తిని వారిపై నాయకుడిగా నియమించారు. మరియు అతనికి విధేయత చూపమని వారికి ఆదేశించారు. ఒకసారి అతనికి కోపం వచ్చి, ఇలా అన్నాడు: "నాకు విధేయత చూపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని ఆదేశించలేదా?" వారు, "అవును" అని అన్నారు. అప్పుడు అతను, "నా కోసం కట్టెలు సేకరించండి" అని అన్నాడు. వారు సేకరించారు. ఆపై, "అగ్నిని రాజేయండి" అని అన్నాడు. వారు రాజేశారు. ఆ తర్వాత, "దానిలో ప్రవేశించండి" అని అన్నాడు. వారు అందులో ప్రవేశించడానికి సిద్ధపడగా, ఒకరినొకరు పట్టుకుంటూ, "మేము అగ్ని నుండి తప్పించుకోవడానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది" అని అన్నారు. అగ్ని ఆరిపోయి, అతని కోపం చల్లారే వరకు వారు అలాగే ఉండిపోయారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరినప్పుడు, ఆయన ఇలా సెలవిచ్చారు: «ఒకవేళ వారు దానిలో ప్రవేశించి ఉంటే, ప్రళయదినం వరకు దాని నుండి బయటకు వచ్చేవారు కాదు; విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే చూప వలసి ఉంటుంది».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిస్రాకు, కైసర్‌కు, నజాషీకి మరియు ప్రతి శక్తివంతమైన పాలకుడికి లేఖలు వ్రాశారు, అందులో వారిని మహోన్నతుడైన అల్లాహ్ వైపు పిలుపునిచ్చారు, మరియు అతను ఆ నజాషీ కాదు, ఎవరి కోసమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (జనాజా) నమాజు చేశారో.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు ఒక రోజులో రెండు పూటల భోజనం చేస్తే, అందులో ఒకటి కేవలం ఖర్జూరాలు మాత్రమే ఉండేవి.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు