Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 7 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"మనిషి తన కడుపు కంటే చెడు పాత్రను ఎన్నడూ నింపలేదు. మనిషికి తన వెన్నెముకను నిలబెట్టుకోవడానికి కొన్ని ముద్దలు చాలు. అయితే తప్పనిసరిగా తినవలసి వస్తే, అతని ఆహారం కోసం ఒక వంతు, అతని పానం కోసం ఒక వంతు, మరియు అతని శ్వాస కోసం ఒక వంతు."
ప్రామాణికమైన హదీథు ఇమామ్ అహ్మద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి. అలాగే సమావేశాలలో ఉన్నత ఆసనం (కావాలని) ఎంచుకోకండి. ఎవరైతే అలా చేస్తారో – (వారి కొరకు) నరకాగ్ని, నరకాగ్ని”.
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మీకూ వాటికి (అల్ ఫితన్) మధ్య ఒక మూసివేసిన ద్వారం ఉంది. అది త్వరలోనే బ్రద్దలు కాబోతున్నది”. ఉమర్ రదియల్లాహు అన్హు “అది బ్రద్దలవుతుందా? నీకు తండ్రి లేకుండా పోవుగాక? ఒకవేళ అది తెరుచుకున్నా, తిరిగి అది మూసుకుపోవచ్చుకదా?” నేను ఇలా అన్నాను “లేదు అది బ్రద్దలవుతుంది”, నేను ఆయనకు వివరించాను “నిశ్చయంగా ఆ ద్వారము మనిషిని సూచిస్తుంది. అతడు చంపబడవచ్చు, లేదా చనిపోవచ్చు. ఈ హదీథులో ఎంతమాత్రమూ తప్పు అనేది లేదు. అబూ ఖాలిద్ ఇలా ఉల్లేఖించినారు నేను సా’అద్ తో ఇలా చెప్పాను “ఓ అబూ మాలిక్, “అస్వద్ ముర్బద్ద” అనే పదానికి అర్థం ఏమిటి?” దానికి అతడు “నలుపులో (కలిసిఉన్న) ఉత్తమ స్థాయి తెలుపు” అన్నాడు. నేను “మరి “అల్ కూజు ముజక్ఖియన్” అంటే అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాను. దానికి అతడు: “అంటే అది బోర్లించబడి యున్న పాత్ర” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు."
ప్రామాణికమైన హదీథు అని ఇమాం నవవీ (ర.హ) తెలిపినారు. కితాబ్ అల్-హుజ్జహ్ లో ప్రామాణికమైన ఇస్నాద్ తో నమోదు చేసినారు:
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: