Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 6 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి భోజనం చేసిన సందర్భములలో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు చేతిని చాచే వరకు మేము మా చేతిని చాచే వారము కాము. ఒకసారి మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనానికి హాజరైనపుడు, ఒక చిన్న అమ్మాయి, ఎవరో ముందుకు తోస్తున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చి, ఆహారపు పళ్ళెములో తన చేయి పెట్టబోతుండగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె చేతిని పట్టుకున్నారు. అలాగే ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు రాగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్నైనా షైతాన్ తన కొరకు ‘హలాల్’ (అనుమతించ బడినదిగా) చేసుకుంటాడు. అతను (షైతాన్) ఈ చిన్న అమ్మాయిని తీసుకువచ్చాడు (ఆమె ద్వారా) ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు గాను, కానీ నేను ఆమె చేతిని పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకు వచ్చాడు, ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు. నేను అతని చేయి కూడా పట్టుకున్నాను. నా ఆత్మ ఎవరి చేతిలోనైతే ఉన్నదో, ఆయన సాక్షిగా, వాడి చేయి (షైతాను చేయి) ఆమె చేతితో పాటు నా చేతిలో ఉన్నది.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: