Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 12 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది."
ప్రామాణికమైన హదీథు మొదటి హదీథు: దీనిని ముస్లిం నమోదు చేసినారు:, మరియు రెండవ హదీథు: దీనిని అహ్మద్ మరియు అద్దార్మీ నమోదు చేసినారు:
"చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి. చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు:
“భూమి సంపాదనలో నిమగ్నులు కాకండి; తద్వారా మీరు ఇహలోక సుఖాల వైపునకు ఆకర్షించబడవచ్చు.”
హసన్ హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
నేను అమ్మార్ బిన్ యాసిర్ మస్జిదులో ప్రవేశించి నమాజు చేయడం చూశాను, ఆయన నమాజును చాలా క్లుప్తంగా చేసారు. ఆయన బయటకు వచ్చినప్పుడు, నేను ఆయన వద్దకు వెళ్లి, "ఓ అబుల్ యఖ్జాన్, మీరు నమాజును చాలా క్లుప్తంగా చేసారు" అని అన్నాను. దానికి ఆయన, "నేను దాని నియమాలలో దేనినైనా విడిచిపెట్టినట్లు మీరు చూశారా?!" అని అడిగారు. నేను "లేదు" అని సమాధానమిచ్చాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "నిశ్చయంగా, షైతాన్ పరధ్యానం నుండి తప్పించుకోవడానికి నేను తొందరపడ్డాను. నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను: «నిశ్చయంగా ఒక దాసుడు నమాజు చేస్తాడు, కానీ అతనికి దాని నుండి పదవ వంతు, తొమ్మిదవ వంతు, ఎనిమిదవ వంతు, ఏడవ వంతు, ఆరవ వంతు, ఐదవ వంతు, నాలుగవ వంతు, మూడవ వంతు, సగం తప్ప పుణ్యం వ్రాయబడదు (నమాజులో తన పరధ్యానం కారణంగా పుణ్యాలు కోల్పోతాడు)».
హసన్ హదీథు. ఆహ్మద్ నమోదు చేసినారు:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135] {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"మనిషి తన కడుపు కంటే చెడు పాత్రను ఎన్నడూ నింపలేదు. మనిషికి తన వెన్నెముకను నిలబెట్టుకోవడానికి కొన్ని ముద్దలు చాలు. అయితే తప్పనిసరిగా తినవలసి వస్తే, అతని ఆహారం కోసం ఒక వంతు, అతని పానం కోసం ఒక వంతు, మరియు అతని శ్వాస కోసం ఒక వంతు."
ప్రామాణికమైన హదీథు ఇమామ్ అహ్మద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం మరియు అహ్మద్ నమోదు చేసినారు: