Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 50 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని తలక్రింద ఉంచుకుని, అపుడు ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తజ్మ’ఉ అవ్ తబ్’అసు ఇబాదక్” (ఓ అల్లాహ్! నీవు నీ దాసులను సమీకరించే దినమున లేదా నీవు నీ దాసులను తిరిగి బ్రతికించే దినమున (పునరుత్థాన దినమున) నీ శిక్ష నుండి నన్ను రక్షించు).”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే దానిని సంపాదించుకోవాలి; అలాగాక ఎవరైతే ఈ లోక ప్రయోజనం కోసం మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు స్వర్గం యొక్క ‘అర్’ఫ’ ను కూడా రుచి చూడరు, అంటే స్వర్గపు సువాసనను కూడా రుచి చూడరు”.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మమ్ములను - రోగిని పరామర్శించాలి అని; మరణించినవారి శవయాత్రలో పాల్గొనాలి అని; తుమ్మినవాడు "అల్హమ్దులిల్లాహ్" అన్నప్పుడు "యర్హముకల్లాహ్" అని చెప్పాలి అని; చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి, అలాగే ఎవరైనా ప్రమాణం చేస్తే, అది నిజం అయ్యేలా సహాయం చేయాలి; అణచివేయబడిన వారికి మద్దతు ఇవ్వాలి, ఎవరైనా ఆహ్వానించినట్లైతే ప్రతిస్పందించాలి (స్వీకరించాలి); ‘సలాం’ను విస్తరింపజేయాలి అని ఆదేశించినారు. అలాగే మాకు ఈ విషయాలు నిషేధించినారు – పురుషులు బంగారు ఉంగరాలు ధరించరాదని; వెండి పాత్రలలో త్రాగరాదని; ‘అల్-మయాథీర్’; ‘ఖస్సీ’; ‘అల్-ఇస్తబ్రక్’ మరియు ‘అల్-దిబాజ్’ లను ఉపయోగించరాదు అని నిషేధించినారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు