Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 32 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు