Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 1 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

“ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త చనిపోతే మాత్రం ఆమె నాలుగు నెలల పది దినములు దుఃఖ దినములుగా సంతాపములో గడపాలి. ఆమె (ఆ దుఃఖదినములలో) రంగులద్దిన వస్త్రాలు ధరించరాదు, ‘అస్బ్’ (అంత ఆకర్షణీయం కాని) వస్త్రాలు తప్ప. ‘కొహ్’ల్’ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) పూయరాదు. ఆమె రుతుస్రావానికి గురైతే దాని నుండి శుద్ధి అయిన తరువాత తప్ప సుగంధద్రవ్యాలను (అత్తరు, పెర్’ఫ్యూమ్ మొ.) తాకరాదు, అయితే (శుద్ధి అయిన తరువాత) ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ వంటి సుగంధ ద్రవ్యాలను పూయవచ్చును.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు