Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 97 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (49)
“శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెంప యొక్క తెలుపు కనబడేంతగా తన కుడి వైపునకు తిరిగి మరియు ఎడమ వైపునకు తిరిగి సలాం చేయగా నేను చూశాను.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ముగ్గురి పైనుండి (మూడు రకాల వ్యక్తులపైనుండి) కలము లేపివేయబడినది (వారిని గురించి ఏమీ నమోదు చేయదు); వారు: నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుంచి మేల్కొనేంత వరకు; యుక్త వయస్సుకు చేరని బాలుడు/బాలిక అతడు యుక్తవయస్సుకు చేరేంతవరకు, మరియు మతిస్థిమితము కోల్పోయిన పిచ్చివాడు, అతడు తిరిగి మతిస్థిమితం పొందేంతవరకు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబరుపై ఉండగా ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు ’రాత్రి (తహజ్జుద్ )నమాజు ఎలా చేయాలి అనే విషయంపై మీ మార్గదర్శకం ఏమిటి? అని అడిగాడు, రెండు రెండుగా చేసి చేయి, తెల్లవారుతుందన్న భయం వేసినప్పుడు (తహజ్జుద్ సమయం ముగిస్తున్నప్పుడు) ‘ఒక రకాత్ చదువు’ అది చదివిన రకాతులను బేసిగా మార్చేస్తుంది.’ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఎల్లప్పుడు ప్రవచిస్తూ ఉండేవారు ’మీ రాత్రి యొక్క చివరి నమాజును వితర్ (బేసి) నమాజుగా మార్చుకోండి’ నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరగా దీనిని (వితర్ ను) ఆచరించమని ఆదేశించారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు. వారు ముందుగా మస్జిద్‌కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను. “నుదురు (అలా అని ఆయన చేతితో తన ముక్కు వైపునకు సంజ్ఞ చేసినారు), రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, మరియు రెండు కాళ్ళ చివరలు (అంటే రెండు కాలివేళ్ళు); మరియు బట్టలను గానీ జుట్టును గానీ పైకి దోపుకోరాదని కూడా ఆదేశించబడినది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు