“నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులలో) ఒక దాసుని ప్రేమించినపుడు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నేను ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాను, కనుక అతడిని ప్రేమించు”. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులలో) ఒక దాసుని ప్రేమించినపుడు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నేను ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాను, కనుక అతడిని ప్రేమించు”. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. మరియు అతడు (జిబ్రయీల్) ఆకాశాలలో పిలుపునిస్తాడు; అతడు ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి”, అపుడు ఆకాశ నివాసులందరూ అతడిని ప్రేమిస్తారు. అప్పుడు అతనికి భూమిపై ఆమోదం లభిస్తుంది. అలాగే ఒకవేళ అల్లాహ్ (తన దాసులలో) ఒకరిని ద్వేషించినట్లయితే, జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను. కనుక అతడిని ద్వేషించు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. అపుడు జిబ్రయీల్ ఆకాశావాసులలో పిలుపునిస్తాడు, అతడు (జిబ్రయీల్) ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, కనుక అతడిని ద్వేషించండి”. అపుడు వారందరూ అతడిని ద్వేషిస్తారు. మరియు అతని పట్ల భూమిలో ద్వేషం స్థిరపడుతుంది”.
«إِنَّ اللهَ إِذَا أَحَبَّ عَبْدًا دَعَا جِبْرِيلَ فَقَالَ: إِنِّي أُحِبُّ فُلَانًا فَأَحِبَّهُ، قَالَ: فَيُحِبُّهُ جِبْرِيلُ، ثُمَّ يُنَادِي فِي السَّمَاءِ فَيَقُولُ: إِنَّ اللهَ يُحِبُّ فُلَانًا فَأَحِبُّوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، قَالَ ثُمَّ يُوضَعُ لَهُ الْقَبُولُ فِي الْأَرْضِ، وَإِذَا أَبْغَضَ عَبْدًا دَعَا جِبْرِيلَ فَيَقُولُ: إِنِّي أُبْغِضُ فُلَانًا فَأَبْغِضْهُ، قَالَ فَيُبْغِضُهُ جِبْرِيلُ، ثُمَّ يُنَادِي فِي أَهْلِ السَّمَاءِ إِنَّ اللهَ يُبْغِضُ فُلَانًا فَأَبْغِضُوهُ، قَالَ: فَيُبْغِضُونَهُ، ثُمَّ تُوضَعُ لَهُ الْبَغْضَاءُ فِي الْأَرْضِ».
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: “తన ఆజ్ఞలను పాటించే మరియు తన నిషేధాలనుండి దూరంగా ఉండే విశ్వాసి అయిన దాసుడిని అల్లాహ్ ప్రేమించినప్పుడు, ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా సర్వోన్నతుడైన అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించు”. అపుడు దైవదూతల నాయకుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. ఇంకా జిబ్రయీల్ అలైహిస్సలాం ఆకాశాల దైవదూతలందరిలో ఇలా ప్రకటిస్తాడు: “నిశ్చయంగా మీ ప్రభువు ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి. అపుడు ఆకాశవాసులందరూ అతడిని ప్రేమిస్తారు. మరియు అతని పట్ల ప్రేమ, ఇష్టము, ప్రేరణల ద్వారా విశ్వాసుల హృదయాలలో అతని పట్ల ఆమోదము వేయబడుతుంది. మరియు అల్లాహ్ ఎవరైనా దాసుడిని ద్వేషించినట్లయితే, ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను, కనుక అతడిని ద్వేషించు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. ఇంకా జిబ్రయీల్ అలైహిస్సలాం ఆకాశ వాసులందరిలో ఇలా ప్రకటిస్తాడు: “నిశ్చయంగా మీ ప్రభువు ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, అతడిని ద్వేషించండి”. అపుడు వారు అతడిని ద్వేషిస్తారు. మరియు విశ్వాసుల హృదయాలలో అతని పట్ల ద్వేషం మరియు అసహ్యం నాటబడతాయి.
అబూ ముహమ్మద్ ఇబ్న్ అబీ జమ్రహ్ ఇలా అన్నారు: “మిగతా దైవదూతలందరికంటే ముందు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఈ విధంగా ఆదేశించడం, అల్లాహ్ వద్ద మిగతా దైవదూతలందరిపై జిబ్రయీల్ అలైహిస్సలాం యొక్క ఉన్నతమైన స్థానాన్ని తెలియజేస్తున్నది”.
ఎవరినైనా అల్లాహ్ ప్రేమిస్తే, ఆకాశాలు మరియు భూమిలో నివసిస్తున్న వారూ అతడిని ప్రేమిస్తారు. మరియు అల్లాహ్ ఎవరినైనా ద్వేషిస్తే అకాశాలు మరియు భూమిలో నివసిస్తున్న వారూ అతడిని ద్వేషిస్తారు.
అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన “అప్పుడు అతనికి భూమిపై ఆమోదం స్థాపించబడుతుంది” – ఆ మాటలు తప్పనిసరిగా సాధారణంగా లేదా సార్వత్రికంగా అతని పట్ల ఆమోదాన్ని సూచించవు. అల్లాహ్ అతనికి భూమిపై ఎంత అమోదాన్ని ఇస్తాడో దానికి అనుగుణంగా ఉంటుంది; ముఖ్యంగా నీతిమంతుల పట్ల దుష్టులకు ఉన్న శత్రుత్వం అందరికీ తెలుసు.
ఈ హదీథులో అన్ని రకాల సత్కార్యాలను నెరవేర్చాలనే ప్రోత్సాహం ఉన్నది – అవి విధిగా ఆచరించవలసినవి అయినా, లేక తనకుతాను స్వచ్చందంగా ఆచరించేవి అయినా. అలాగే పాపాలకు వ్యతిరేకంగా మరియు ధర్మములో నూతనపోకడలు, నూతన ఆవిష్కరణలకు వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది, ఎందుకంటే అవి అల్లాహ్ యొక్క అసంతృప్తికి, ఆగ్రహానికి కారణాలు కావచ్చు.
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "ఈ హదీథు ద్వారా, ప్రజల హృదయాలలో ప్రేమ అనేది అల్లాహ్ యొక్క ప్రేమకు ఒక సంకేతం అని అర్థం చేసుకోవచ్చు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క హదీథులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు వ్యక్తుల జనాజా వేర్వేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందునుంచి వెళ్ళినపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన మాటలు “భూమిపై మీరు అల్లాహ్ యొక్క సాక్షులు” అని పలకడం దీనికి మద్దతు ఇస్తున్నాయి."
ఇబ్న్ అల్ అరబి అల్ మాలికి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో ‘ప్రజలు’ అంటే ఆ వ్యక్తిని గురించి ఎరిగిన వారు అని అర్థం; అ వ్యక్తిని గురించి ఎరుగని వారు కాదు.”
సహీహ్ అల్ బుఖారీ. (4/ 111) (3209).
సహీహ్ ముస్లిం. (4/ 2030) (2637).
ఇంకా (8)
شرح رياض الصالحين.
لابن عثيمين (3/ 268).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 355).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (6/ 308).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 455).