ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
«أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ: يَا كَافِرُ، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا، إِنْ كَانَ كَمَا قَالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునితో "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అనకూడదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విధంగా అవిశ్వాసి అని అనడం వలన, ఆ మాట వారిద్దరిలో ఒకరిపై పడుతుంది: అది నిజంగా అతనికి సరిపోతే, అప్పుడు ఆ మాట అతను అలా అన్న వ్యక్తిపై పడుతుంది; ఒకవేళ అలా లేకపోతే, ఆ నింద తిరిగి చెప్పినవాడిపైనే పడుతుంది.
ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునిపై అతనిలో లేని అవిధేయత లేదా అవిశ్వాసం (కుఫ్ర్) వంటి లక్షణాలను ఆపాదించకుండా నిరోధించడం.
ఈ చెడ్డ మాటల నుండి హెచ్చరిక ఉంది. ఎవైతే ఈ మాటలు తన సోదరుని గురించి మాట్లాడతాడో అతను పెద్ద ప్రమాదంలో ఉంటాడు. కాబట్టి, నోరు జాగ్రత్తగా వాడాలి; వివేకంతోనే మాటలాడాలి.
సహీహ్ అల్ బుఖారీ. (8/ 26) (6104).
సహీహ్ ముస్లిం. (1/ 79) (60).
ఇంకా (3)
البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (2/ 390).
إرشاد الساري لشرح صحيح البخاري (9/ 65).
النهاية في غريب الحديث والأثر (91).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
3 గ్రంథాలుఇంకా (3)
- قاموس الكبائرموسوعة الكبائر - المجموعة الثانية«أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ: يَا كَافِرُ، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا، إِنْ كَانَ كَمَا قَالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ» [100].
- مادة العقيدة الإسلامية(أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ: يَا كَافِرُ، فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا، إِنْ كَانَ كَمَا قَالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ).
- مجموعة زاد العقيده (4)العقيدة 4«أَيُّما امْرِئٍ قال لِأَخِيهِ: يا كافِرُ، فَقَدْ باءَ بِها أَحَدُهُما، إِنْ كانَ كَما قالَ، وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ».