Skip to content

“ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”

«السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ اللَّهِ، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ».

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఒక వితంతువు - ఆమె భర్త చనిపోయాడు, ఆమె మంచి చెడ్డలు చూడడానికి ఆమె తరఫున ఎవరూ లేరు – అటువంటి వితంతువు యొక్క, మరియు నిరుపేదలు, అక్కరలు గల పేదవారు – ఇటువంటి వారి యొక్క మంచిచెడ్డలు, కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే ప్రతిఫలం ఆశిస్తూ, ఎవరైతే చూస్తారో, అందు కొరకు వారిపై ఖర్చు చేస్తారో, అటువంటి వాడు ప్రతిఫలములో అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వానికి (శ్రమించిన వానికి), లేదా రాత్రుళ్ళు తహజ్జుద్ నమాజులో గడిపినా అలుపు లేకుండా, ఇఫ్తార్ లేకుండా ఉపవాసం పాటించేవానితో సమానం.

పదాల అర్థాలు

...:

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో పేదలు మరియు బలహీనులు, అక్కరలు గలవారి పట్ల సామరస్యత, సానుభూతి కలిగి ఉండుట, వారికి సహకరించుట మొదలైన మంచి అలవాట్లు అలవర్చుకోవాలనే సందేశం, ప్రోత్సాహం ఉన్నాయి.

“ఇబాదత్”లో (ఆరాధనలో) మంచి పనులు చేయుట కూడా ఒక భాగము. మరియు ఎవరూ దిక్కు లేని వితంతువుకు మరియు నిరుపేదలకు సహాయం చేయుట, వారి బాగోగులు చూసుకొనుట కూడా ఒక ఇబాదతే (ఆరాధనే).

ఇబ్నె హుబైరహ్ ఇలా అన్నారు: “ఇందులోని భావం ఏమిటంటే - ఆ వ్యక్తి కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక ఉపవాసి యొక్క, ఒక ముజాహిద్ యొక్క మరియు ఒక నిరంతరం తహజ్జుద్ పఠించే వాని యొక్క – ఈ ముగ్గురి ప్రతిఫలాలను జమ చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే అతడు వితంతువుకు ఆమె కోల్పోయిన భర్త స్థానములో నిలబడుతున్నాడు, పేదలు, నిరుపేదలు, అక్కరలు గలవారు – తమ అవసరాల కొరకు తామే నిలబడలేని స్థితిలో ఉన్న అసహాయులు, అటువంటి వారికొరకు, అతడు తన శక్తిని ఖర్చు పెడుతున్నాడు, శ్రమించి సంపాదించిన సంపదను ఖర్చు పెడుతున్నాడు, అందుకని అతని ప్రతిఫలం – నిరంతరం ఉపవాసాలు పాటించే వాని ప్రతిఫలానికీ, నిరంతరం తహజ్జుద్ పఠించే వాని ప్రతిఫలానికీ, మరియు అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వాని (శ్రమించిన వాని) ప్రతిఫలానికీ సమానము.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (7/ 62) (5353).

సహీహ్ ముస్లిం. (4/ 2286) (2982).

ఇంకా (9)

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم بن عيد الهلالي (1/ 351).

تطريز رياض الصالحين.

لفيصل بن عبد العزيز المبارك (ص198).

رياض الصالحين (ص107) (265).

شرح رياض الصالحين.

لابن عثيمين (3/ 99).

نزهة المتقين شرح رياض الصالحين.

لمجموعة من الباحثين (275).