Skip to content

«మీరు మీ మృతుల వద్ద లా యిలాహ ఇల్లల్లాహ్ పలకండి».

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«మీరు మీ మృతుల వద్ద లా యిలాహ ఇల్లల్లాహ్ పలకండి».

«لَقِّنُوا مَوْتَاكُمْ لَا إِلَهَ إِلَّا اللهُ».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: మరణం ఆసన్నమైన వారి వద్ద, వారు పలికేంత వరకు మనం తౌహీద్ వాక్యమైన "లా ఇలాహ ఇల్లల్లాహ్" ను పలుకుతూ ఉండాలి, తద్వారా అది వారి చివరి పలుకు అవుతుంది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

మరణఘడియలోని వ్యక్తికి తల్ఖీన్ చేయడం ముస్తహబుగా సూచించబడింది. (తల్కీన్ అంటే ఎవరికైతే మరణం ఆసన్నమవుతుందో, వారికి "లా ఇలాహ ఇల్లల్లాహ్" (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు) అనే కలిమా షహాదత్‌ను పక్కన ఉండి నెమ్మదిగా పదే పదే పలకమని గుర్తుచేయడం లేదా బోధించడం.)

మరణావస్థలో ఉన్న వ్యక్తికి విసుగు కలిగించి, అతను అనుచితమైన మాటలు పలికేలా చేయవచ్చు కాబట్టి, అతనికి తల్ఖీన్ ను అతిగా చేయడం, ముఖ్యంగా అతను ఒకసారి పలికిన తర్వాత లేదా పలికినట్లుగా అర్థమైన తర్వాత కూడా పదే పదే ఒత్తిడి తీసుకురావడం అనుచితం.

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒకసారి దానిని పలికిన తర్వాత, అతనికి మళ్ళీ గుర్తు చేయకూడదు. అయితే, దాని తర్వాత అతను వేరే ఏదైనా మాట్లాడితే, అది అతని చివరి మాటగా ఉండేందుకు గాను అతనికి మళ్ళీ గుర్తు చేయాలి.

ఈ హదీథులో మరణశయ్యపై ఉన్న వ్యక్తి వద్ద హాజరుకావడం, అతనికి హితబోధ చేయడం, సాంత్వన చేకూర్చడం, అతని కళ్ళు మూయడం మరియు అతని హక్కులను నెరవేర్చడం వంటివి ఉన్నాయి.

మరణానంతరం మరియు ఖననం తర్వాత సమాధి వద్ద తల్ఖీన్ చేయడం ధర్మబద్ధం కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (2/ 631) (916).

ఇంకా (1)

المفهم لما أشكل من تلخيص كتاب مسلم (2/ 569).