Skip to content

ధర్మం యొక్క అవసరం ఏమిటి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ధర్మం యొక్క అవసరం ఏమిటి?

الجواب

నిశ్చయంగా అన్నపానీయాల అవసరం కంటే ధర్మం ఆవశ్యకత చాలా ఎక్కువగా అవసరం ఉంది. ఎందుకంటే మనిషి సహజంగానే ధార్మికుడు, ఒకవేళ అతను నిజమైన సత్యధర్మాన్ని పొందలేకపోతే, మానవులు కల్పించిన విగ్రహారాధన మతాలలో జరిగినట్లుగా అతను తన కోసం ఒక ధర్మాన్ని సృష్టించుకుంటాడు. మరియు మనిషికి ఇహలోకంలో భద్రత,రక్షణ ఎంత అవసరమో, అతని మరణం తరువాత మరియు పరలోకంలో కూడా అతనికి భద్రత,రక్షణ అంతే అవసరం ఉంది.

సత్యధర్మం అనేది దానిని అనుసరించేవారికి ఇహపరలోకాల్లో పూర్తి శాంతిని ప్రసాదిస్తుంది. ఉదాహరణకు:

  • ఒక వేళ మనం ఒక మార్గములో నడుస్తూ ఉండి, దాని ముగింపు మనకు తెలియకపోతే, మన ముందు రెండు ఎంపికలు ఉంటాయి: ఆ మార్గములోని సూచికల పై ఉన్న సూచనలను మనం అనుసరించడం, లేదా ఊహించడానికి ప్రయత్నించడం, ఇది మనం దారితప్పడానికి మరియు విధ్వంసానికి కారణం కావచ్చు.
  • ఒకవేళ మనము ఒక టెలివిజన్ పరికరాన్ని కొనుగోలు చేసి, దాని ఆపరేటింగ్ సూచనలను పరిశీలించకుండా దానిని పనిచేయించడానికి ప్రయత్నిస్తే, మనము దానిని పాడుచేస్తాము. ఒకే కర్మాగారం నుండి తయారైన టెలివిజన్, ఉదాహరణకు, వేరొక దేశానికి చేరే అదే సూచనల పుస్తకంతోనే (instruction manual) ఇక్కడికి మనకు చేరుతుంది, కాబట్టి మనము దానిని అదే విధంగా ఉపయోగించాలి.
  • ఉదాహరణకు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంప్రదించాలనుకుంటే, ఆ మరొక వ్యక్తి తనకు సాధ్యమయ్యే విధానాన్ని అతనికి తెలియజేయాలి, అనగా ఇమెయిల్ ద్వారా కాకుండా ఫోన్ ద్వారా మాట్లాడమని చెప్పడం, మరియు అతను స్వయంగా అందించిన ఫోన్ నెంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి, వేరే ఏ ఇతర నెంబర్‌ను ఉపయోగించకూడదు.

గత ఉదాహరణలు మనకు తెలియజేసేదేమిటంటే, మనుషులు తమ ఇష్టాలకు అనుగుణంగా అల్లాహ్ ను ఆరాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఇతరులకు హాని చేసే కంటే ముందు తమకు తామే హాని చేసుకుంటారు. సర్వలోకాల సృష్టికర్తతో సంబంధం ఏర్పరచుకోవడానికి కొంతమంది ప్రజలు ఆరాధనా మందిరాలలో నృత్యం మరియు గానం చేయడం మనం చూస్తాము, మరియు ఇతర ప్రజలు తమ నమ్మకం ప్రకారం దైవాన్ని మేల్కొల్పడానికి చప్పట్లు కొడతారు. వారిలో కొందరు ఒక మధ్యవర్తిని ఎంచుకుని అల్లాహ్ ను ఆరాధిస్తారు, మరియు అల్లాహ్ మనిషి లేదా రాయి రూపంలో వస్తాడని భావిస్తారు. మనకు ప్రయోజనం చేకూర్చని మరియు హాని చేయని, పైగా పరలోకంలో మన నాశనానికి కారణమయ్యే వాటిని మనం ఆరాధించినప్పుడు, అల్లాహ్ మనలను మన నుంచే రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించడం అత్యంత ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది, మరియు దాని శిక్ష నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటం. నిశ్చయంగా అల్లాహ్ యొక్క గొప్పదనం ఏమిటంటే, ఆయనతో మన సంబంధాన్ని మరియు మన చుట్టూ ఉన్నవారితో మన సంబంధాన్ని క్రమబద్ధీకరించడానికి, మనమందరం అనుసరించాల్సిన ఒక వ్యవస్థను ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు. దానినే 'దీన్' (ధర్మం) అని అంటారు.

المصدر

قسم الإسلام

ملاحظات

--