47 : 38
هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَمِنكُم مَّن يَبۡخَلُۖ وَمَن يَبۡخَلۡ فَإِنَّمَا يَبۡخَلُ عَن نَّفۡسِهِۦۚ وَٱللَّهُ ٱلۡغَنِيُّ وَأَنتُمُ ٱلۡفُقَرَآءُۚ وَإِن تَتَوَلَّوۡاْ يَسۡتَبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ثُمَّ لَا يَكُونُوٓاْ أَمۡثَٰلَكُم
ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలువబడుతున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరత గల (పేద) వారు. మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటి వారై ఉండరు.
Explanation & meanings · 1
- అల్లాహ్ (సు.తా.) మిమ్మల్ని ఖర్చు చేయమని ప్రోత్సహించేది మీ ఆత్మశుద్ధి కొరకు, మీ చుట్టు ప్రక్కలలో ఉండే పేదవారి అత్యావసరాలను పూర్తి చేయటానికి మరియు మీరు మీ శత్రువులపై ఆధిక్యత పొందటానికి.