Skip to content
النور /

ఆయత్ 41

24 : 41
النور ఆయతులు 64
సూరా · النور
తెలుగు · Muhammad
24 : 41

أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُسَبِّحُ لَهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱلطَّيۡرُ صَٰٓفَّٰتٖۖ كُلّٞ قَدۡ عَلِمَ صَلَاتَهُۥ وَتَسۡبِيحَهُۥۗ وَٱللَّهُ عَلِيمُۢ بِمَا يَفۡعَلُونَ

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

Explanation & meanings · 2
  1. అంటే ప్రతి దానికి అల్లాహ్ (సు.తా.) యొక్క స్తోత్రం (ప్రార్థన) ఏ విధంగా చేయాలో తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయడమనేది కూడా అల్లాహ్ (సు.తా.) ఘనతలలో ఒకటి. ఏ విధంగానైతే వాటిని సృష్టించడం కూడా కేవలం ఆయన (సు.తా.) ఘనతలలో ఒకటో! చూడండి, 17:44.
  2. విచక్షణాశక్తి లేని ప్రతివస్తువు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేస్తుంది. అలాంటప్పుడు ఈ విచక్షణాశక్తి గల జిన్నాతులు మరియు మానవులు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయకుంటే వారు ఆయన శిక్షకు అర్హులు కాగూడదా ?