22 : 19
۞ هَٰذَانِ خَصۡمَانِ ٱخۡتَصَمُواْ فِي رَبِّهِمۡۖ فَٱلَّذِينَ كَفَرُواْ قُطِّعَتۡ لَهُمۡ ثِيَابٞ مِّن نَّارٖ يُصَبُّ مِن فَوۡقِ رُءُوسِهِمُ ٱلۡحَمِيمُ
ఆ రెండు విపక్ష తెగల వారు తమ ప్రభువును గురించి వాదులాడారు, కావున వారిలో సత్యతిరస్కారులకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి (కుట్టించబడి) ఉంటాయి, వారి తలల మీద సలసలకాగే నీరు పోయబడు తుంది.
Explanation & meanings · 1
- కొందరు వ్యాఖ్యాతలు వీరిని, విశ్వాసులు మరియు సత్యతిరస్కారులతో పోల్చారు. ఇతరులు బద్ర్ యుద్ధంలో పోరాడిన విశ్వాసులు మరియు ముష్రికులైన మక్కా ఖురైషులతో పోల్చారు. ఇబ్నె-కస'ర్ (ర'హ్మ) ఈ రెండు వ్యాఖ్యానాలు సరైనవే అంటారు.