Skip to content
البَقَرَة /

ఆయత్ 266

2 : 266

ఆయత్ 266 of البَقَرَة (2 : 266). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 266

أَيَوَدُّ أَحَدُكُمۡ أَن تَكُونَ لَهُۥ جَنَّةٞ مِّن نَّخِيلٖ وَأَعۡنَابٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ لَهُۥ فِيهَا مِن كُلِّ ٱلثَّمَرَٰتِ وَأَصَابَهُ ٱلۡكِبَرُ وَلَهُۥ ذُرِّيَّةٞ ضُعَفَآءُ فَأَصَابَهَآ إِعۡصَارٞ فِيهِ نَارٞ فَٱحۡتَرَقَتۡۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُونَ

ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జురపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో, ఆ తోట మంటలు గల సుడిగాలి వీచి కాలిపోటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను (ఆయత్ లను) మీకు విశదీకరిస్తున్నాడు.

Explanation & meanings · 1
  1. ఇబ్నె - 'అబ్బాస్ మరియు 'ఉమర్ (ర'ది.'అన్హుమ్) ల కథనం: "ఇది ఆ వ్యక్తి ఉదాహరణ, ఎవడైతే తన జీవితమంతా మంచికార్యాలు చేసి చివరి రోజులలో షై'తాన్ వలలో చిక్కుకొని అల్లాహ్ (సు.తా.)కు అవిధేయుడై పోతాడో! అలాంటి వాడు చేసిన పుణ్యకార్యాలన్నీ వ్యర్థమై పోతాయి." ('స. 'బుఖారీ, కితాబ్ అల్ తఫ్సీర్).