13 : 3
وَهُوَ ٱلَّذِي مَدَّ ٱلۡأَرۡضَ وَجَعَلَ فِيهَا رَوَٰسِيَ وَأَنۡهَٰرٗاۖ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِ جَعَلَ فِيهَا زَوۡجَيۡنِ ٱثۡنَيۡنِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ
మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి.
Explanation & meanings · 1
- వృక్షకోటిలో కూడా ఆడ-మగ అంతరం ఉంది. సాధారణంగా ఆడ-మగ అంగాలు ఒకే పువ్వులో ఉంటాయి. ఉదా: మామిడి, కొన్ని ఒకే వృక్షం మీద వేర్వేరు పువ్వులలో ఉంటాయి. ఉదా:దోసతీగ. మరికొన్ని వేర్వేరు వృక్షాలపై ఉంటాయి. ఉదా: ఖర్జూరపు చెట్లు.