Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 54 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్పాటు
ప్రామాణికమైన హదీథు ఇమామ్ అహ్మద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్, మరియు ఇబ్న్ హిబ్బాన్ తన సహీహ్ లో మరియు హాకిమ్ నమోదు చేసినారు:
"నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో."
ప్రామాణికమైన హదీథు అహ్మద్, అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: