Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 115 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (56)
"ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".
హసన్ హదీథు. అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“పిసినారి ఎవరంటే, తన సమక్షములో నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్ధించని వాడు (దరూద్ పఠించనివాడు).”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని యమన్‌కు పంపినప్పుడు, అతనికి ఇలా ఆదేశించారు: ఆవుల విషయంలో, ప్రతీ ముప్పై ఆవుల నుండి ఒక మగ లేదా ఆడ దూడను తీసుకోవాలి, మరియు ప్రతీ నలభై ఆవుల నుండి ఒక ముసన్నను (రెండు సంవత్సరాల ఆడ దూడను) తీసుకోవాలి, మరియు ప్రతీ యుక్తవయస్కుడి నుండి - అనగా యుక్తవయస్సు వచ్చినవాడి నుండి - ఒక దీనారు లేదా దానికి సమానమైన మఆఫిర్, అనగా యమన్‌లో ఉండే వస్త్రాలను తీసుకోవాలి.
సాక్ష్యాల ఆధారంగా ప్రామాణికమైనది. అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.”
హసన్ హదీథు. ఆహ్మద్ నమోదు చేసినారు:
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచుగా ఇలా దుఆ చేస్తూ ఉండేవారు “యా ముఖల్లిబల్ ఖులూబ్, సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్” (ఓ హృదయాలను త్రిప్పివేసేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై దృఢంగా ఉండేలా చేయి). నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! మేము మిమ్మల్ని విశ్వసించినాము, మరియు మీరు ఏ సందేశమునైతే తెచ్చినారో దానిని విశ్వసించినాము. మీరు మా గురించి భయపడుతున్నారా?” దానికి ఆయన “అవును, (ఎందుకంటే) హృదయాలు అల్లాహ్ చేతి రెండు వేళ్ళమధ్య ఉంటాయి. ఆయన వాటిని తన చిత్తము వచ్చిన వైపునకు మరల్చుతాడు” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)
ప్రామాణికమైన హదీథు అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన “ ‘అల్-ఆఫియహ్’(క్షేమము, శ్రేయస్సు, సుస్థితి, ఆరోగ్యము మొ.) ప్రసాదించమని అర్థించు” అన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి” అని అడిగాను. దానికి ఆయన: “ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: