Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 84 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన “ ‘అల్-ఆఫియహ్’(క్షేమము, శ్రేయస్సు, సుస్థితి, ఆరోగ్యము మొ.) ప్రసాదించమని అర్థించు” అన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి” అని అడిగాను. దానికి ఆయన: “ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” తరువాత ఆయన ఈ ఆయతును పఠించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను.నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".} [గాఫిర్ 40:60]
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే దానిని సంపాదించుకోవాలి; అలాగాక ఎవరైతే ఈ లోక ప్రయోజనం కోసం మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు స్వర్గం యొక్క ‘అర్’ఫ’ ను కూడా రుచి చూడరు, అంటే స్వర్గపు సువాసనను కూడా రుచి చూడరు”.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు. “ఇన్నల్ హంద లిల్లాహి, నస్తయీనుహు, వ నస్తఘ్’ఫిరుహు, వ నఊజుబిహి మిన్ షురూరి అన్’ఫుసినా, మయ్యహ్’దిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్’లిల్ ఫలా హాదియలహు, వ అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. {యాఅయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, వ ఖలఖ మిన్’హా జౌజహా, వ బస్స మిన్’హుమా రిజాలన్ కసీరన్, వ నిసాఅన్, వత్తఖుల్లాహల్లజీ తసాఅలూనబిహి, వల్ అర్హామ్, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా}[సూరహ్ అన్ నిసా:1]; {యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి, వలా తమూతున్న ఇల్లా వ అన్’తుమ్ ముస్లిమూన్.} [సూరహ్ ఆలి ఇమ్రాన్:102]; {యా అయుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వఖూలూ ఖౌలన్ సదీదన్}; {“యుస్’లిహ్’లకుం ఆ’మాలకుం, వ యఘ్’ఫిర్’లకుం, జునూబకుం, వమన్’యుతిఇల్లాహ వ రస్సులహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా} [అల్ అహ్’జాబ్ 70, 71] (నిశ్చయంగా సకలస్తోత్రములూ, మరియు ప్రశంసలన్నియూ కేవలం అల్లాహ్ కొరకే, మేము అయనను మాత్రమే సహాయం కొరకు వేడుకుంటాము, మరియు మమ్ములను క్షమించమని ఆయను మాత్రమే వేడుకుంటాము, మాలోని కీడు నుండి ఆయన రక్షణ కోరుకుంటాము, ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడో, అతడిని ఎవరూ మార్గభ్రష్ఠుడిని చేయలేరు, మరియు ఎవరినైతే ఆయన మార్గభ్రష్ఠత్వములో వదిలివేసినాడో, ఎవరూ అతనికి సన్మార్గ దర్శకం చేయలేరు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడని మరియు ఆయన సందేశహరుడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. {ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు} [సూరతున్’నిసా 4:1]; { ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి} [సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3:102]; {ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి; ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు} [సూరతుల్ అహ్’జాబ్ 30:70,71]
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. అప్పుడు ఒక సంవత్సర కాలం ఒక నెల లాగా ఉంటుంది; ఒక నెల ఒక వారం మాదిరిగా ఉంటుంది; ఒక వారం ఒక రోజులాగా ఉంటుంది; ఒక రోజు ఒక గంట మాదిరిగా ఉంటుంది; ఒక గంట ఒక ఖర్జూరపు ఆకు కాలిపోయినంత తక్కువగా ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు:
మరణ సమయం ఇంకా సమీపించని రోగిని సందర్శించి, అతని సమక్షంలో ఎవరైనా ఏడుసార్లు ఇలా అంటే అల్లాహ్ అతనిని ఆ వ్యాధి నుండి నయం చేస్తాడు: 'అస్’అలల్లాహుల్-‘అజీమ్ రబ్బుల్-‘అర్షిల్-‘అజిమ్ అన్ యష్ఫియక్ (నిన్ను నయం చేయమని నేను గొప్ప సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ్‌ను అర్థిస్తున్నాను)'
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: