Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 95 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (52)
“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”
ప్రామాణికమైన హదీథుగా ధృవీకరించబడింది. అబూ దావూద్, అన్నసాయీ అల్ కుబ్రాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”
హసన్ హదీథు. అబూదావూద్ నమోదు చేసినారు:
“శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవారాధన); శకునములను విశ్వసించుట ‘షిర్క్’; శకునములను విశ్వసించుట ‘షిర్క్’ అని మూడు సార్లు అన్నారు. మరియు మనలో ప్రతి ఒక్కరూ దానిని ఎంతో కొంత అనుభవించిన వారమే; అయితే సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తనపై ఉంచిన భరోసా ద్వారా దానిని తొలగిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”
హసన్ హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నాయకత్వములో మాకు ఫజ్ర్ నమాజు చదివించారు. తరువాత “ఫలానా అతణ్ణి చూసారా?” అని అడిగారు. దానికి అక్కడ ఉన్న వారు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “మరి ఫలానా అతణ్ణి చూసారా?” అని ప్రశ్నించారు. దానికి వారు “లేదు” అని సమాధానమిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు. (నమాజులో) మొదటి వరుస దైవదూతల శ్రేణి లాంటిది. దాని ఘనతను మీరు తెలుసుకుంటే అందులో చేరడానికి మీరు పోటీ పడతారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) నమాజు ఆచరించుట, అతడు ఒంటరిగా నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. మరియు అతడు మరో ఇద్దరితో కలిసి నమాజు ఆచరించుట ఒక్క వ్యక్తితో కలిసి నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అది (ఆ జమాఅత్) సర్వోన్నతుడైన అల్లాహ్’కు అంత ప్రీతిప్రదమైనది అవుతుంది.
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము తింటున్నాము కానీ కడుపు నిండినట్లు ఉండడం లేదు.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బహుశా మీరు విడివిడిగా తింటున్నారు కావచ్చు?” దానికి వారు: “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు:“కలిసి భోజనం చేయండి, ఆహారంపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అందులో మీకు శుభం కలుగుతుంది.”
హసన్ హదీథు. అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: