Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 37 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”
ప్రామాణికమైన హదీథుగా ధృవీకరించబడింది. అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
«ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న తో ఇలా అన్నారు “ (ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను”. దానికి ఆయన ఇలా అన్నాడు “(ఎదురుగా నిలబడిన) మృత్యువు భయం నేను అలా చేసేలా ప్రేరేపించింది అని ఖురైషీయులు నన్ను నిందిస్తారనే (అవమానిస్తారనే) భయం గానీ లేక పోతే, నిశ్చయంగా దానితో (ఆ పదాలతో) నీ కళ్ళకు ఆనందం, సంతోషం కలిగించేవాడిని”. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింప జేసినాడు { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్‌ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందేవారెవరో బాగా తెలుసు} (సూరహ్ అల్ ఖసస్ 28:56)
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదు (ప్రాంగణము)లో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, (మా వద్దకు వచ్చి) “మీలో ముహమ్మద్ ఎవరు?” అని ప్రశ్నించాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “ఇదిగో తెల్లని మేని ఛాయతో, చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే” అన్నాము. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశ్యించి “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు అతడు “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక “కోపగించుకోకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, మరియు నీకంటే ముందు గడిచిపోయిన వారి ప్రభువు సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను – అల్లాహ్ నిన్ను సర్వ మానవాళి కొరకు (తన) సందేశహరునిగా పంపించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను “దినము రాత్రిలో (రాత్రింబవళ్ళలో) ఐదు సార్లు సలాహ్ (నమాజు) ఆచరించాలని నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ మనిషి తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాను, సంవత్సరం మొత్తములో (ఫలానా) ఈ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను, మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, దానిని మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ‘జిమామ్ ఇబ్న్ సాలబా’, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు