Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 27 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక వ్యక్తి ఇలా అడిగాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము అజ్ఞాన కాలములో (ఇస్లాం స్వీకరించుటకు పూర్వపు జీవితంలో) చేసిన పనులకు (తీర్పు దినము నాడు) జవాబుదారులుగా పట్టుకోబడతామా? ” దానికి ఆయన “ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
“అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలికి, సలాహ్ ను స్థాపించి, జకాతు చెల్లించే వరకు ప్రజలతో పోరాడమని నేను ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు అలా చేస్తే వారు తమ రక్తాన్ని (ప్రాణాన్ని) మరియు తమ సంపదలను నా నుంచి రక్షించుకున్నట్లే; ఇస్లామీయ చట్టాల ద్వారా (మరణ శిక్ష విధించబడితే) తప్ప.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినాడు: “ఒకవేళ ఎవరైనా ఒక అవిశ్వాసి (యుద్ధంలో తారసపడి) మేమిద్దరమూ తలపడినపుడు; అతడు తన కరవాలముతో నా చేతిపై దాడి చేసి, నా చేతిని ఖండించి వేసి, నా నుంచి పరుగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అల్లాహ్’కు నన్ను నేను సమర్పించుకున్నాను” అని షహాదా పఠించినట్లైతే, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు ఆ విధంగా (షహాదా) పలికిన తరువాత నేను అతడిని చంపవచ్చునా?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, అతడిని చంపరాదు” అన్నారు. దానికి మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు. దాని తరువాత కూడా అతడిని వధించకూడదా?” అన్నాడు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను “ఓ రసూలుల్లాహ్! ఇబ్నె జుదాన్ బంధాలను, బాంధవ్యాలను గౌరవించేవాడు, వాటిని నిలిపి ఉంచేవాడు, కొనసాగించేవాడు, మరియు (ఇస్లాం కు పూర్వపు) అఙ్ఞాన కాలములో పేదవారికి అన్నం తినిపించేవాడు. ఇది (ఈ మంచిపనులు) అతనికి ఏమైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?” దానికి ఆయన “ఇది అతనికి ఏమీ ప్రయోజనం కలుగజేయదు, ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు