Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 27 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినాడు: "మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా భావిస్తూ, మరియు నిషేధించబడిన దానిని నిషేధించబడినదిగా భావిస్తూ, నేను దానిపై ఏమీ అధికంగా చేయకుండా ఉంటే, నేను స్వర్గంలో ప్రవేశిస్తానా?" ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అవును."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నజ్ద్ ప్రాంతపు ప్రజల నుండి చెదిరిన జుట్టుతో ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతను ఉచ్ఛ స్వరంతో మాట్లాడడం మేము వినగలుగుతున్నాము, కాని అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చే సరికి, అతను ఇస్లాం గురించి అడుగుతున్నాడని స్పష్టమైంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా చెప్పారు: “దినము మరియు రాత్రిలో (విధిగా ఆచరించవలసిన) ఐదు సలాహ్’లు (నమాజులు) ఉన్నాయి”; దానికి అతడు “ఇవి గాక ఇంకేమైనా (నమాజులు) నాపై ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప. అలాగే (విధిగా ఆచరించవలసిన) రమదాన్ మాసపు ఉపవాసాలున్నాయి” అన్నారు. అతడు “ఇవిగాక నాపై ఇంకేమైనా (ఉపవాసాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జకాత్ గురించి తెలిపినారు. దానికి అతడు “ఇది గాక నాపై ఇంకేమైనా (దానాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలనుకుంటే తప్ప” అన్నారు. దానితో అతడు ఇలా అంటూ వెనుదిరిగినాడు “అల్లాహ్ సాక్షిగా, దీనిపై ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, దీని నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఆనాటి బహుదైవారాధకులలో ఎన్నో హత్యలు, మరెన్నో మానభంగాలకు పాల్బడిన, ఒక సమూహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా పలికినారు: “నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?” అపుడు (ఈ ఆయతు) అవతరించినది: “మరియు ఎవరైతే, అల్లాహ్‌తోపాటు ఇతర దైవాలను ఆరాధించరో, మరియు అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో, మరియు వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. (సూరహ్ అల్ ఫుర్ఖాన్ 25:68). మరియు ఈ ఆయతు అవతరించినది: "ఇలా ప్రకటించు: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన, కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత." (సూరహ్ అజ్-జుమర్ 39:53)
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒకసారి హుదైబియాలో (ఉన్నప్పుడు) రాత్రి వర్షం పడిన తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజు చదివించినారు. నమాజు ముగిసిన తరువాత ఆయన ప్రజల వైపునకు తిరిగి ఇలా అన్నారు “మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు. ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని అన్నారో, వారు నన్ను విశ్వసించినారు మరియు నక్షత్రాలను విశ్వసించలేదు. మరియు ఎవరైతే ‘ఫలాన ఫలాన నక్షత్రాలు ఉదయించడం వలన మనపై వర్షం కురిసింది’ అన్నారో, వారు నన్ను విశ్వసించలేదు, మరియు నక్షత్రాలను విశ్వసించినారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు