Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 20 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
"నాలుగు లక్షణాలు ఎవరిలో ఉంటాయో, అతను కపటివాడు అవుతాడు. ఒకవేళ వాటిలో ఒక లక్షణం అతనిలో ఉంటే, అతను దానిని విడిచిపెట్టే వరకు అతనిలో కపటత్వపు ఒక లక్షణం ఉన్నట్లే. ఆ లక్షణాలు ఏమిటంటే: అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు, వాగ్దానం చేస్తే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు, వాగ్దానం చేస్తే దానిని భంగం చేస్తాడు, మరియు ఒప్పందం చేసుకుంటే మోసం చేస్తాడు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ముఆద్ ఇబ్నె జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు పంపునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: “నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని సాక్ష్యం పలుకమని వారిని ఆహ్వానించు. మరి వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా వారిపై ప్రతి రోజూ ఐదు పూటల నమాజు ఆచరించుటను అల్లాహ్ విధిగా చేసినాడు’ అని. వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా అల్లాహ్ వారిపై ‘సదాఖా చెల్లించుటను (జకాత్ చెల్లించుటను) విధిగా చేసినాడు’ అని, ‘అది వారిలోని ధనవంతుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోని పేదవారికి ఇవ్వబడుతుంది’ అని. వారు అందులో కూడా నిన్ను అనుసరించినట్లయితే (ఓ ముఆద్!) వారి సంపదలలోని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త (జకాతులో భాగంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయకు). అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన వాని దువా పట్ల భయపడు. ఎందుకంటే, నిశ్చయంగా వాని ఆక్రందనకూ, అల్లాహ్ కు మధ్య ఎటువంటి అడ్డూ ఉండదు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అఙ్ఞానపు కాలములో (ఇస్లాం స్వీకరించక ముందు కాలములో) పేదవారికి దానము చేయుట, బానిసలకు విముక్తి కలిగించుట, బంధువులను ఆదరించుట, వారితో బంధుత్వాలను కొనసాగించుట మొదలైన మంచిపనులు చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఆ మంచిపనుల ప్రతిఫలం లభిస్తుందా?” దానికి ఆయన “నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు