عربي - Arabic English Qafár af - Afar Afrikaans - Afrikanns Akan Shqip - Albanian አማርኛ - Amharic Հայերեն - Armenian অসমীয়া - Assamese Azərbaycanca - Azerbaijani Bamanankan - Bambara Bassa Bemba বাংলা - Bengali Bosanski - Bosnian Български - Bulgarian မြန်မာဘာသာ - Burmese Bisaya - Cebuano Cham Нохчий - Chechen chiCheŵa - Chewa 中文 - Chinese Адыгэбзэ - Circassian Hrvatski - Croatian Česky - Czech Dagbani Dansk - Danish فارسی دری - Dari Dendi ދިވެހި ބަސް - Dhivehi Nederlands - Dutch إستوني - Estonian Suomi - Finnish Français - French Fulfulde - Fula ქართული - Georgian Deutsch - German Ελληνικά - Greek ગુજરાતી - Gujrati Kreyòl ayisyen - Haitian Creole Hausa हिन्दी - Hindi Magyar - Hungarian Igbo Indonesia - Indonesian Italiano - Italian 日本語 - Japanese Jóola - Jola ಕನ್ನಡ - Kannada Қазақша - Kazakh ភាសាខ្មែរ - Khmer Kikuyu Ikinyarwanda - Kinyarwanda Ikirundi - Kirundi 한국어 - Korean كوردی سۆرانی - kurdish كوردي kurmancî - Kurmanji Kyrgyz ລາວ - Lao latviešu - Latvian Lingala lietuvių - Lithuanian Luganda Македонски - Macedonian Maguindanaon Malagasy - Malagasy Bahasa Melayu - Malay മലയാളം - Malayalam Mandinka मराठी - Marathi Mõõré - Moore नेपाली - Nepali أنكو - NKo Norwegian ଓଡ଼ିଆ - Odia oromoo - Oromo پښتو - Pashto فارسی - Persian Polski - Polish Portuguese ਪੰਜਾਬੀ - Punjabi Română - Romanian Русский - Russian Српски - Serbian Shona සිංහල - Sinhala Slovenščina - Slovenian Soomaaliga - Somali Soninke Sesotho - Sotho Español - Spanish Kiswahili - Swahili Svenska - Swedish Tagalog Тоҷикӣ - Tajik தமிழ் - Tamil తెలుగు - Telugu ไทย - Thai ትግረኛ - Tigrinya Türkçe - Turkish Ukrainian اردو - Urdu ئۇيغۇرچە - Uyghur Ўзбек - Uzbek Việt Nam - Vietnamese Wolof Yao Yorùbá - Yoruba Zarma زولو - Zulu
837 హదీసులు
ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం
వర్గాలు
హదీసు స్థాయి
ఉల్లేఖించిన గ్రంథం
ఉల్లేఖకుడు
అన్ని ఉల్లేఖకులను చూపించు (16)
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చున్నాము — మాతో అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు — అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లేచి నిలబడి నడిచిపోతూ మా మధ్య నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతసేపైనా ఆయన తిరిగి రాకపోవడంతో మేము ఆందోళనకు లోనయ్యాము. ఆయనకు ఏదైనా జరిగిందేమో అని భయపడ్డాము. మేము భయపడుతూ లేచి నిలిచాము. నేనే మొదట భయంతో స్పందించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతుకుతూ బయలుదేరాను. దారిలో బనూ నజ్జార్ తెగకు చెందిన ఒక అన్సారీ సాహాబీ తోట వద్దకు చేరుకున్నాను. ఆ తోట చుట్టూ తిరిగి, లోనికి ప్రవేశించడానికి ఏదైనా ద్వారం ఉందేమో అని చూశాను — కానీ ఏమి కనిపించలేదు. తోటకు బయట ఉన్న ఒక బావి నుండి తోట లోనికి నీళ్ళు ప్రవేశిస్తూ ఉన్న ఒక ప్రదేశం కనిపించింది. నేను బాగా క్రిందకు ఒదిగిపోయి ఆ ప్రదేశం గుండా లోనికి ప్రవేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అబూ హురైరహ్” అన్నారు; దానికి నేను “అవును ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం” అని జవాబు పలికాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. నేను “మీరు మాతో ఉన్నారు, ఆ తరువాత లేచి వెళ్లిపోయారు, ఎంత సేపైనా తిరిగి రాకపోయేసరికి మేము భయపడిపోయాం, మీకు ఏదైనా జరిగిందేమో అని. భయంతో అందరికంటే ముందు నేను మిమ్మల్ని వెదుకుతూ ఈ తోటకు వచ్చాను. అటు ప్రక్కనుంచి నక్క ప్రవేశించినట్లు నేను తోటలోనికి ప్రవేశించినాను. మిగతా వాళ్ళు నా వెనుక వస్తున్నారు” అన్నాను. ఆయన ﷺ, “ఓ అబూ హురైరా”, అని అన్నారు మరియు తన రెండు పాదరక్షలను నాకు అందజేసి, “ఈ రెండు పాదరక్షలతో వెళ్ళు. ఈ తోట చుట్టూ ఉన్న గోడ వెనుక నీవు ఎవరిని కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని తన హృదయంలో పూర్తి నిశ్చయతతో సాక్ష్యమిచ్చి నట్లైతే, అతనికి స్వర్గ ప్రవేశాన్ని గురించిన శుభవార్తనివ్వు” అన్నారు. నేను మొదటగా కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన అడిగారు “నీ చేతిలో ఆ రెండు పాదరక్షలు ఏమిటి ఓ అబూ హురైరహ్?” నేను సమాధానమిచ్చాను: “ఇవి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి పాదరక్షలు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంనన్ను వీటితో పంపారు. నేను కలిసిన ఎవరికైనా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) నా ఛాతీపై బలంగా మోదినారు. నేను వెల్లకిలా పడిపోయాను. ఆయన “వెనుకకు తిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు తిరిగివచ్చాను. నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను. నా వెనుకనే ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అడిగారు: “అబూ హురైరా! నీకు ఏమైంది?” “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చెప్పాను: “నేను ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిశాను. మీరు నాకు అప్పగించిన సందేశాన్ని ఆయనకు చెప్పాను. ఆయన నా ఛాతీపై బలంగా కొట్టారు, నేలపై పడిపోయాను. ఆయన: “ఓ అబూ హురైరహ్, తిరిగి వెళ్ళు” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ప్రశ్నించారు: “ఓ ఉమర్, నీవు ఇలా ఎందుకు చేశావు?” ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు: “ఓ రసూలుల్లాహ్! (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా తండ్రి మరియు తల్లి మీ కొరకు త్యాగం (ఖుర్బాన్) చేయబడుదురు గాక. మీరు నిజంగా అబూ హురైరాని మీ పాదరక్షలతో పంపినారా? ఎవరు కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” చెప్పినారా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అన్నారు. అపుడు ఉమర్ రజియల్లాహు అన్హు “అలా చేయవద్దు, (మంచి పనులు చేయడం వదిలివేసి) ప్రజలు ఆ ఒక్క వాక్యం పైనే భారం వేసి ఉండిపోతారేమోనని నాకు భయంగా ఉన్నది. వారిని మంచి పనులు చేయడం కొనసాగించనివ్వండి” అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అలాగే కానివ్వండి” అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
తాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణం లో ఆయన వెంట ఉన్నారు. అపుడు వారి వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుణ్ణి వారి వద్దకు “ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి) లేదు, అలాగే ఏ “తియరహ్” (అపశకునము) లేదు; అయితే “అల్ ఫా’ల్” ను (మంచి శకునాన్ని) నేను ఇష్టపడతాను”. ఆయన వద్ద ఉన్న వారు ప్రశ్నించారు “అల్ ఫా’ల్” అంటే ఏమిటి?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఒక మంచి మాట” అన్నారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు.” ఉమర్ రజియల్లాహు అన్హు కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను); రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటను విన్నప్పటినుండి (ఒట్టువేసి) నేను ఏదైనా చెప్పాలన్నా, లేక ఎవరి మాటనైనా (ఒట్టు వేసి) చెప్పాలన్నా ఎప్పుడూ నా తండ్రి, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయలేదు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు