Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 5 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ వైపునకు ప్రయాణమై బయలుదేరినపుడు దారిలో బహుదైవారాధకులు (పవిత్రమైనదిగా భావించే) “జాతు అన్వాత్” అని పిలుచుకునే ఒక వృక్షం పక్క నుండి వెళ్ళడం జరిగింది. బహుదైవారాధకులు తమ ఆయుధాలను ఆ వృక్షంపై ఉంచేవారు. అపుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారికి “జాతు అన్వాత్” ఏవిధంగా ఉన్నదో, మాకు కూడా ఒక “జాతు అన్వాత్” ను ఏర్పాటు చేయండి”. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విస్మయంగా “సుబ్’హానల్లాహ్! ఇది సరిగ్గా ఇజ్రాయీలు సంతతి వారు మూసా (అలైహిస్సలాం) ను అడిగిన విధంగా ఉన్నది - {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ} [الأعراف: 138] [“…..వీరి ఆరాధ్యదైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”] (సూరహ్ అల్ ఆరాఫ్ 7:138) అన్నారు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”
ప్రామాణికమైన హదీథుగా ధృవీకరించబడింది. అబూ దావూద్, అన్నసాయీ అల్ కుబ్రాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:
«ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు.»
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు:
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు ‘అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది’ అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటీ, నువ్వు నన్ను అల్లాహ్’కు సమానుడిగా చేస్తున్నావా? ఇలా అను: “ఏకైకుడైన అల్లాహ్ కోరిన విధంగానే జరుగుతుంది.”
దాని ఆధారాలు ప్రామాణికమైనవి. رواه ابن ماجه والنسائي في الكبرى وأحمد
“కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
హసన్ హదీథు. ఆహ్మద్ నమోదు చేసినారు: