Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 1 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

నేను మరియు కొందరు అన్సార్ స్త్రీలు ఒక బృందంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత ప్రతిజ్ఞ చేయుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినాము. మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మేము అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించమని, దొంగతనానికి పాల్బడబోమని, వ్యభిచారానికి పాల్బడము అని, మా చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని మరియు ఏ మంచి విషయం లోనూ మేము మీకు అవిధేయత చూపము అని మీకు విధేయత ప్రకటిస్తున్నాము”; అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “(మీకు) సాధ్యపడినంత వరకు మరియు భరించగలిగినంత వరకు” అన్నారు. ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు “మేము ఇలా అన్నాము: “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాపై (స్త్రీలపై) ఎక్కువ కరుణామయులు; రండి ఓ రసూలుల్లాహ్ మిమ్మల్ని మీ చేతిపై ప్రమాణం చేయనివ్వండి”. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఒక మహిళకు చెప్పిన నా మాటలు.."
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: