Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 16 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
[తమ వ్యవహారాల భాద్యతను ఒక స్త్రీకు అప్పచెప్పిన జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు}
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బనీ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేయడానికి ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని నియమించారు. అతను తిరిగి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని లెక్క అడిగారు. అతను, 'ఇది మీ జకాత్ సంపద, మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది' అని అన్నాడు. దానిపై, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు "నీవు చెబుతున్నది నిజమే అయితే, నీకు బహుమతులు వచ్చే వరకు నువ్వు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు ఉండలేదు?" తరువాత ప్రవక్త మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించినారు, అల్లాహ్‌ను స్తుతించి, ఆయనను కీర్తించిన తర్వాత, ఆయన ఇలా అన్నారు: "అమ్మా బా'దు", అల్లాహ్ నా ఆధీనంలో ఉంచిన దానిలో కొంత పనిని నిర్వహించడానికి నిశ్చయంగా నేను మీలో ఒక వ్యక్తిని నియమిస్తాను, ఆపై అతను నా వద్దకు వచ్చి ఇలా అంటాడు “ఇది మీ (జకాతు) సంపద మరియు ఇది బహుమతి, బహుమతిగా నాకు ఇవ్వబడింది”. మరి అతనికి (ఎవరైనా) బహుమతులు ఇస్తారా లేదా అని చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు (నిరీక్షించి) ఉండలేదు? అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను), మీలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా తీసున్నట్లయితే, దానిని మోసుకుంటూ పునరుత్థాన దినమున అల్లాహ్‌ను కలుస్తారు. మీలో ఎవరూ అల్లాహ్‌ను కలుసుకోవడానికి వెళ్ళినపుడు, రంకెలు పెడుతున్న ఒంటెను, అరుస్తూ ఉండే ఆవును లేదా ‘బేబే’ అని అరుస్తున్న గొర్రెను మోసుకెళ్లడం నేను చూడదల్చుకోలేదు." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను తన చంకల తెల్లదనం కనిపించే వరకు పైకెత్తి, "ఓ అల్లాహ్! నేను (నీ సందేశాన్ని) అందజేయలేదా?" అని అన్నారు. ఉల్లేఖకుడైన అబూ హుమైద్ అస్సాయిదీ ఇంకా ఇలా అన్నారు: “నా కళ్ళు చూశాయి మరియు (ఆ హదీథును) నా చెవులు విన్నాయి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ‘అల్ హౌలాఅ బింత్ తువైత్ ఇబ్న్ హబీబ్ ఇబ్న్ అబ్దిల్ ఊజ్జా’ నా వద్దకు వచ్చి వెళ్ళినది. నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో “ఆమె హౌలాఅ బింత్ తువైత్, ఆమె రాత్రుళ్లు (ఇబాదత్’లో) అసలు నిద్రపోదు అని ఆమెను గురించి చెప్పుకుంటారు” అన్నాను. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “: “ఓహ్, ఆమె (ఇబాదత్’లో) రాత్రిపూట నిద్రపోదా! మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (ప్రతిఫలం ప్రసాదించడంలో) అలసిపోడు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ మేము వారి మాట వింటామని మరియు వారికి విధేయులుగా ఉంటామని (వారి ఆదేశపాలన చేస్తామని) మరియు (పాలకులు బాహాటంగా, విస్పష్టంగా అవిశ్వాసానికి పాల్బడితే తప్ప) అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా పోరాడము అని, మేము ఎక్కడ ఉన్నా, నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, ఎల్లవేళలా అల్లాహ్ కొరకు కేవలం సత్యాన్నే పలుకుతామని - మేము విధేయతా ప్రతిజ్ఞ చేసినాము.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు