Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 5 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”
హసన్ హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా (నా తరువాత) పాలకులు వస్తారు. వారు అసత్యాలు పలుకుతారు మరియు దౌర్జన్యానికి పాల్బడతారు. ఎవరైతే వారి అసత్యాలను విశ్వసిస్తాడో, వారి దౌర్జన్యాలకు సహాయపడతాడో, అతడు నావాడు కాడు; నేను అతని వాడను కాను, మరియు అతడు తీర్పుదినమున ‘అల్-హౌధ్’ తటాకము (జలాశయం) దగ్గర నా వద్దకు రాలేడు. మరియు ఎవరైతే వారి అసత్యాలను విశ్వసించడో, మరియు వారి దౌర్జన్యాలలో వారికి సహాయపడడో అతడు నావాడు, నేను అతని వాడను, మరియు అతడు ‘అల్-హౌధ్’ తటాకము దగ్గర నా వద్దకు వస్తాడు.”
ప్రామాణికమైన హదీథు ఆహ్మద్ నమోదు చేసినారు: