Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 123 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (54)
(ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్-అషజ్జి – అషజ్జి అబ్దిల్ ఖైస్ రదియల్లాహు అన్హుతో ఇలా పలికారు: “నిశ్చయంగా నీలో అల్లాహ్ ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి – అవి ప్రాజ్ఞత (దూరదృష్ఠి), వివేకం మరియు సహనము”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఎవరైతే గర్వంతో (అహంకారంతో) తన వస్త్రాన్ని నేలపై ఈడుస్తూ నడుస్తాడో, పరలోకంలో అల్లాహ్ అలాంటి వారి వైపు చూడడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: