Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 123 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (54)
"అల్లాహ్ నాకు ఇచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానం యొక్క ఉదాహరణ భూమిపై సమృద్ధిగా కురిసే వర్షం లాంటిది, అందులో కొంత భాగం సారవంతమైన నేల, అది వర్షపు నీటిని పీల్చుకుని సమృద్ధిగా వృక్షసంపదను మరియు గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. అందులోని మరొక భాగం గట్టిగా ఉండే బంజరు భూమిలాంటిది అది వర్షపు నీటిని నిలుపుకుంటుంది. దాని ద్వారా ప్రజలు తమ దాహార్తిని తీర్చుకున్నారు, తమ పొలాలకు నీరు పెట్టుకున్నారు, మొక్కలను పెంచుకున్నారు; అలా ప్రజలకు అల్లాహ్ ప్రయోజనాన్ని చేకూర్చుతాడు. మరియు అందులో మరొక భాగము సమతలంగా ఉన్న మైదానం వంటిది. అది నీటిని నిలుపుకోలేదు మరియు వృక్ష సంపదను ఉత్పత్తి చేయలేదు. అటువంటి భూమి ఎటువంటి ప్రయోజనాన్నీ ఇవ్వలేదు. మొదటి ఉపమానం అల్లాహ్ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకుని, అల్లాహ్ నా ద్వారా అవతరింపజేసిన ఙ్ఞానము నుండి ప్రయోజనం పొంది, నేర్చుకుని ఇతరులకు బోధించే వ్యక్తి ఉదాహరణ వంటిది. చివరి ఉపమానం ఏమిటంటే, దానిని గురించి పట్టించుకోని వ్యక్తి మరియు నా ద్వారా అల్లాహ్ పంపిన మార్గదర్శకత్వాన్ని తీసుకోని వ్యక్తి .”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. వారు కూడా మేము చేస్తున్నట్లుగానే నమాజ్ చేస్తారు, మేము ఉన్నట్లుగానే ఉపవాసం ఉంటారు, కానీ (మేము చేయలేని విధంగా) తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు." అప్పుడు ప్రవక్త ఇలా పలికినారు: "అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?" అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతడు పాపం చేసినట్లుగా లెక్కించబడతాడని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: