Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 37 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: "అస్సలాము అలైకుం" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చినారు, ఆ తరువాత ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "పది" అన్నారు. ఆ పిదప మరొకతను వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఇరవై" అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ముప్పై" అన్నారు.
హసన్ హదీథు. అబూ దావూద్, అత్తిర్మిదీ, అహ్మద్ మరియు అద్దారమీ నమోదు చేసినారు:
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
నేను ఇలా అడిగాను: "ఓ రసూలుల్లాహ్‌! నేను ఎవరి పట్ల విధేయత చూపాలి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: "నీ తల్లి, మళ్లీ నీ తల్లి, మళ్లీ నీ తల్లి, ఆ తర్వాత నీ తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలోని సమీప బంధువులు..."
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత కంటే బరువైనది ఏదీ లేదు. నిశ్చయంగా, అల్లాహ్ అసభ్యకరమైన మరియు నిత్యం తిట్లు, బూతులు పలికే అవమానకరమైన వ్యక్తిని అసహ్యించుకుంటాడు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.
ప్రామాణికమైన హదీథుగా ధృవీకరించబడింది. అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా?” దానికి వారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఆ మాటను మూడుసార్లు పునరావృతం చేసారు. అప్పుడు ఒక వ్యక్తి, “తప్పకుండా ఓ రసూలుల్లాహ్! మాలో ఉత్తములు ఎవరో, అధములు ఎవరో మాకు తెలియజేయండి” అని అన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: «మీలో ఉత్తముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడుతుంది మరియు అతని కీడు నుండి భద్రత లభిస్తుంది. మరియు మీలో అధముడు ఎవరంటే, అతని నుండి మేలు ఆశించబడదు మరియు అతని కీడు నుండి భద్రత లభించదు».
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ నమోదు చేసినారు:
అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు: