Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 3 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు". ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను ఇంకా ప్రశ్నించి ఉంటే ఇంకా చెప్పి ఉండేవారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు