Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 35 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“మీరు అల్లాహ్ పై ‘తవక్కల్’ (భరోసా) ఉంచవలసిన విధంగా ‘తవక్కల్’ కలిగి ఉంటే, ఆయన పక్షులకు ప్రసాదించిన విధంగా మీకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు. అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలు దేరుతాయి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయి.”
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.
హసన్ హదీథు. అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.
హసన్ సహీహ్ హదీథు అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
ఒక ముస్లిం యొక్క ఇజార్ (థోబు, లుంగీ లేదా ప్యాంటు అంటే నడుము క్రింది భాగంలో ధరించే వస్త్రం) కనీసం సగం కాలిపిక్క వరకు ఉండాలి. ఒకవేళ అతడి కాలిపిక్కకు మరియు చీలమండలానికి మధ్య భాగంలో ఉంటే అందులో దోషం ఏమీ లేదు. కానీ చీలమండలానికి దిగువన ఉంటే (నేలపై ఈడుస్తూ ఉంటే), అది నరకంలోనికి తీసుకువెళ్తుంది. ఎవరు గర్వంతో తన లుంగీని లేదా ప్యాంటును (గర్వంతో నేలపై) ఈడుస్తారో, అల్లాహ్ అతని వైపు చూడడు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” తరువాత ఆయన ఈ ఆయతును పఠించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను.నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".} [గాఫిర్ 40:60]
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
"ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే దానిని సంపాదించుకోవాలి; అలాగాక ఎవరైతే ఈ లోక ప్రయోజనం కోసం మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు స్వర్గం యొక్క ‘అర్’ఫ’ ను కూడా రుచి చూడరు, అంటే స్వర్గపు సువాసనను కూడా రుచి చూడరు”.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.
హసన్ హదీథు. అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా, ఆమె ఇలా-ఇలా ఉంది..." (ఉల్లేఖకులలో ఒకరు ఇలా పలికినారు: ఆమె 'పొట్టిగా ఉంది’ అని). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది నీటినంతా కలుషితం చేసి వేసేది." అది విని ఆమె ఇలా అన్నది: "నేను మీ వద్ద ఒకరిని వెక్కిరించాను, అనుకరించాను (అంటే, ఎవరో ఒకరి నకిలీగా నటించాను) అని అనగా, దానికి ఆయన 'నాకు ఎంతటి గొప్ప బహుమతి ఇచ్చినా కూడా, నేను ఎవరినైనా వెక్కిరించాలని, అనుకరించాలని అనుకోను.'" అని పలికినారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు: