Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 1 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

ఒక వ్యక్తి జుమా రోజున మస్జిదులోకి దారుల్ ఖదా వైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (మెంబరుపై) నిలబడి ఖుత్బహ్ (ఉపన్యాసం) ఇస్తున్నారు, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (కరువు వలన) సంపద నాశనమైంది మరియు దారులు మూసుకుపోయాయి, మాపై వర్షం కురిపించమని అల్లాహ్ తో దుఆ చేయండి, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులు పైకెత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా (ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు)». అనస్ తెలిపారు: 'అల్లాహ్ సాక్షిగా! ఆ సమయంలో మేము ఆకాశంలో ఒక్క మేఘాన్ని కూడా, చిన్న మేఘపు తునకను కూడా చూడలేదు. మాకు మరియు సల్ (ఒక పర్వతం పేరు) మధ్య ఇల్లు లేదా నివాసం ఏదీ అడ్డుగా లేదు (ఆకాశం స్పష్టంగా ఉంది).' ఇంకా ఆయన ఇలా తెలిపారు: 'అప్పుడు ఆయన ﷺ వెనుక నుండి ఒక డాలు (shield) అంతటి మేఘం ఉద్భవించింది. అది ఆకాశం మధ్యలోకి రాగానే విస్తరించింది, ఆ తర్వాత వర్షం కురిసింది. అల్లాహ్ సాక్షిగా! మేము ఆరు రోజుల పాటు సూర్యుడిని చూడలేదు.' తరువాత, జుమా రోజున ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను ఆయన వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! (వరదల వలన) సంపద నాశనమవుతోంది, మరియు మార్గాలు మూసుకుపోయాయి, అల్లాహ్ తో వర్షం శాంతించాలని దుఆ చేయండి". ఇంకా ఆయన తెలిపారు: అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులను పైకి ఎత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వజ్జీరాబి, వ బుతూనీల్ ఔదీయతి, వ మనాబితిష్షజరతి (ఓ అల్లాహ్! మా చుట్టూ కురిపించు, మాపై కాదు. ఓ అల్లాహ్! దానిని చిన్న కొండలపై, గుట్టలపై, లోయల అంతర్భాగాలపై, మరియు చెట్లు మొలిచే స్థలాలపై కురిపించు)». ఆయన తెలిపారు: అప్పుడు వర్షం నిలిచిపోయింది, మరియు మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము. షరీక్ ఇలా తెలిపారు: నేను అనస్ బిన్ మాలిక్ ను అడిగాను: అతను మొదటి వ్యక్తేనా? దానికి ఆయన: «నాకు తెలియదు» అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు