Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 7 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నన్ను మస్జిదుకు తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరు” అని, తన ఇంటిలోనే నమాజు ఆచరించుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని వెనుకకు పిలిచి “నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
"ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.' "అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, "కావాలంటే మీరు పవిత్ర గ్రంథాన్ని పఠించండి, “ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా” (నిష్చయంగా తెల్లవారుజామున ఖురాన్ పారాయణం (ఫజ్ర్ ప్రార్థన) ఎల్లప్పుడూ వీక్షించబడుతుంది." (సూరహ్ అల్ ఇస్రా 17:78).
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు»
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: