Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రతి ఫర్జ్ నమాజులోనూ, ప్రతి సున్నత్ మరియు నఫీల్ నమాజులోనూ, రమజాన్ నెలలో అయినా, లేక ఇతర నెలలలో అయినా “అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆయన (నమాజు కొరకు) లేచి నిలబడినపుడు “అల్లాహు అక్బర్” అని పలికేవారు, రుకూ చేయునపుడు “అలాహు అక్బర్” అని పలికేవారు. రుకూ నుండి లేచునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, సజ్దాహ్ లోనికి వెళ్ళుటకు ముందు “రబ్బనా లకల్ హంద్” అని పలికేవారు. తరువాత సజ్దాహ్ చేయుట కొరకు వంగునపుడు “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తల పైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు. తిరిగి సజ్దాహ్ చేయునపుడు తక్బీర్ పలికి సజ్దాహ్ చేసేవారు. తరువాత సజ్దాహ్ నుండి తలపైకి లేపునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికేవారు; తరువాత కూర్చుని ఉన్న స్థితి నుండి పైకి లేచునపుడు తక్బీర్ (అల్లాహు అక్బర్) అని రెండు సందర్భాలలోనూ పలికేవారు. సలాహ్ (నమాజు) ముగించే వరకూ ప్రతి రకాతులోనూ ఆయన ఈ విధంగా ఆచరించేవారు. అపుడు (నమాజు ముగించిన తరువాత) వెళ్ళునపుడు ఆయన ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో ఆయన సాక్షిగా – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు మీ అందరిలో నిశ్చయంగా నేను అత్యంత దగ్గరిగా ఉన్నాను. ఈ ప్రపంచం నుండి వెడలిపోయేటంత వరకు ఆయన నమాజు ఈ విధంగానే ఉండినది”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”.
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు: