Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.
ప్రామాణికమైన హదీథు رواه النسائي في السنن الكبرى وابن ماجه
“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదు (ప్రాంగణము)లో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, (మా వద్దకు వచ్చి) “మీలో ముహమ్మద్ ఎవరు?” అని ప్రశ్నించాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “ఇదిగో తెల్లని మేని ఛాయతో, చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే” అన్నాము. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశ్యించి “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు అతడు “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక “కోపగించుకోకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, మరియు నీకంటే ముందు గడిచిపోయిన వారి ప్రభువు సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను – అల్లాహ్ నిన్ను సర్వ మానవాళి కొరకు (తన) సందేశహరునిగా పంపించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను “దినము రాత్రిలో (రాత్రింబవళ్ళలో) ఐదు సార్లు సలాహ్ (నమాజు) ఆచరించాలని నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ మనిషి తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాను, సంవత్సరం మొత్తములో (ఫలానా) ఈ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను, మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, దానిని మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ‘జిమామ్ ఇబ్న్ సాలబా’, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు