Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 2 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
ఒకసారి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు మదీనా వీధులలోని ఒక వీధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడం జరిగింది. అపుడు అబూ హురైరహ్ ‘జనాబహ్’ స్థితిలో (అపరిశుద్ద స్థితి: తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుద్ధ పరుచుకోవలసిన స్థితిలో) ఉన్నారు. ఆయన (అక్కడి నుండి మెల్లగా) జారుకుని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను లేకపోవడాన్ని గమనించి, తిరిగి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ అబూ హురైరహ్?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అపరిశుద్ద స్థితిలో ఉండగా మీతో కలిసినాను. నేను గుస్ల్ చేసి (తలస్నానం చేసి) పరిశుద్ధుడిని కానంత వరకు, ఆ స్థితిలో మీ ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేకపోయింది”; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు