Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 15 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా వుదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (వుదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) వుదూ చేయండి.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
"ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసినా, లేక ‘గుస్ల్’ చేసినా ఒక ‘సా’ నుండి ఐదు ‘ముద్’ ల నీళ్ళతో చేసేవారు. ఉదూ కేవలం ఒక ‘ముద్’ నీళ్ళతో చేసేవారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”
సాక్ష్యాల ఆధారంగా ప్రామాణికమైనది. ముస్లిం నమోదు చేసినారు:
“అమ్ర్ ఇబ్న్ అబీ హసన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానానం గురించి ప్రశ్నించడం నేను చూసాను. దానితో ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకు రమ్మని ఒకరికి పురమాయించారు.దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు. (ముందుగా) ఆయన ఆ నీటి పాత్రను వొంపి చేతులపై నీళ్ళు పోసుకుని, రెండు చేతులను మూడు సార్లు కడిగినారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా నీళ్ళు తీసుకుని నోటిలో పుక్కిలించి, (ముక్కు లోనికి నీళ్ళు ఎక్కించి) ముక్కును చీది (నోటినీ, ముక్కునూ) మూడు సార్లు శుభ్రపరుచుకున్నారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా (మూడు సార్లు) నీళ్ళు తీసుకుని ముఖాన్ని మూడు సార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేయి పెట్టి, నీటితో రెండు చేతులను మోచేతుల సమేతంగా రెండుసార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేతులు పెట్టి (తడి చేతులతో) తలను ఒకసారి మసాహ్ చేసినారు (తడిమినారు) – చేతులను తల ముందు భాగము నుండి వెనుకకు తీసుకు వెళ్ళి, వెనుకనుండి ముందుకు తెచ్చినారు. తరువాత పాదాలను చీలమండలముల వరకు కడిగినారు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది).” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు: